RamGopal Varma: RGV కొత్త సినిమా “వ్యూహం”.. పవన్ కళ్యాణ్ బయోపిక్?
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండే రాంగోపాల్ వర్మ.. మరో వివాదాస్పద సినిమాతో ప్రజల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న 'బయోపిక్?'. ఈ బుధవారం వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం పట్ల సినీ మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. తాజాగా నేడు RGV చేసిన ట్వీట్ ఆ వార్త నిజమనేలా ఉన్నాయి.

RGV new movie Vyuham is Pawan Kalyan Biopic?
RamGopal Varma: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండే రాంగోపాల్ వర్మ.. మరో వివాదాస్పద సినిమాతో ప్రజల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ‘బయోపిక్?’. ఈ బుధవారం వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం పట్ల సినీ మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది.
CM Jagan-RGV meet : సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ భేటీ .. కారణం అదేనా..?!
సాధారణంగా ఎవరికి అంత తేలికగా అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం జగన్.. నిన్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వర్మ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సినిమా తీయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నేడు RGV చేసిన ట్వీట్ ఆ వార్త నిజమనేలా ఉన్నాయి.
రాంగోపాల్ వర్మ.. “నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పీక్. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి” అంటూ ట్వీట్ చేశాడు. గత ఎన్నికల ముందు కూడా వర్మ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ “లక్ష్మీస్ ఎన్టీఆర్” తీశాడు. ఆ సమయంలో అది వైసీపీకి కొంతవరకు కలిసి వచ్చింది.
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల, మూడు పెళ్లిళ్లు రచ్చ నడుస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల సమయానికి సీఎం జగన్, పవన్ ని దెబ్బ కట్టడానికి.. ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే వీటిపై ఎటువంటి క్లారిటీ లేదు, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022