×
Ad

పవర్‌స్టార్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. ‘హరి హర వీరమల్లు’..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మహా శివరాత్రి సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీకి ‘హరి హర వీరమల్లు’ అనే పేరు ఫిక్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

  • Published On : March 11, 2021 / 05:59 PM IST

Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మహా శివరాత్రి సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీకి ‘హరి హర వీరమల్లు’ అనే పేరు ఫిక్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

‘హరి హర వీరమల్లు’ కి (Legendary Heroic Outlaw) అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పవన్ నటిస్తున్న 27వ సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగ ‘హరి హర వీరమల్లు’ పాత్రలో సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, మహారాణి పాత్రలో కనిపించనుంది. పవర్‌స్టార్ కెరీర్‌లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో భారీగా విడుదల కానుంది.

https://10tv.in/pawan-kalyan-new-movie-leaked-pic/

2022 సంక్రాంతికి పవన్ ‘హరి హర వీరమల్లు’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకి మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, సంగీతం : ఎం.ఎం.కీరవాణి, కెమెరా : జ్ఞానశేఖర్, ఎడిటింగ్ : శ్రవణ్, పోరాటాలు : రామ్-లక్ష్మణ్, షామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.