Hari Hara Veera Mallu Movie Unit gives Sudden Update to Pawan Kalyan Fans
Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేతిలో మూడు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో మూడేళ్ళ క్రితం ప్రకటించిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు ఉన్నాయి. అయితే ఇవి ఎన్నికల ముందే వస్తాయి అనుకుంటే పవన్ రాజకీయ షెడ్యూల్స్ బిజీ వల్ల ఈ సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. OG సినిమా నుంచి మాత్రమే రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే పక్కన పెట్టేసి డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంకో సినిమా తీసుకుంటున్నాడు.
ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా అంటూ మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంచెం షూట్ చేయడం, మళ్ళీ ఆగిపోవడం జరుగుతూనే ఉంది. గతంలో హరిహర వీరమల్లు నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేయగా దాంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయింది అనుకున్నారు. ఒకవేళ ఉన్నా ఎన్నికల తర్వాతే అనుకున్నారు. తాజాగా చిత్రయూనిట్ ఒక అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Also Read : Siren : అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ కలిసి ఒకే సినిమాలో.. ‘సైరన్’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
హరిహర వీరమల్లు చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ తన సోషల్ మీడియాలో.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, సినిమా లవర్స్ కి ఒక ఆసక్తికరమైన అప్డేట్. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి VFX వర్క్స్ జరుగుతున్నాయి. కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లో ఈ VFX వర్క్స్ జరుగుతున్నాయి. మీ ఊహలకు కూడా అందనంతగా హరిహర వీరమల్లు సినిమా ఉండబోతుంది. త్వరలో ఓ స్పెషల్ ప్రోమో హరిహర వీరమల్లు సినిమా నుంచి రాబోతుంది. మిమ్మల్ని ఆ ప్రోమో థ్రిల్ కి గురిచేస్తుంది అని తెలిపింది. దీంతో ఈ సినిమా నుంచి సడెన్ గా ఐలాంటి ఓ అప్డేట్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది నెటిజన్లు అయితే ఇంకా ఈ సినిమా ఉందా అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు.
Here's an Update to all the Power Fans & Cinema Lovers! 📣
Currently the High-End VFX Works are in progress ✨
A special promo is coming your way very soon from #HariHaraVeeraMallu that will have you on the edge of your seat! 💥@PawanKalyan @DirKrish @AgerwalNidhhi… pic.twitter.com/RUgYPbzTRr
— Mega Surya Production (@MegaSuryaProd) February 12, 2024