Siren : అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ కలిసి ఒకే సినిమాలో.. ‘సైరన్’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

తమిళ్ స్టార్ హీరో జయం రవి హీరోగా సైరన్ అనే సినిమా రాబోతుంది.

Siren : అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ కలిసి ఒకే సినిమాలో.. ‘సైరన్’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Anupama Parameswaran and Keerthy Suresh in Jayam Ravi Siren Movie Telugu Release Date Announced

Updated On : February 12, 2024 / 6:56 PM IST

Anupama Parameswaran – Keerthy Suresh : తమిళ్ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) హీరోగా సైరన్(Siren) అనే సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైరన్ సినిమా తమిళ్ లో ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతుండగా తెలుగులో మాత్రం ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాని గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఆల్రెడీ తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుపమ జయం రవికి జంటగా నటిస్తుండగా, కీర్తి సురేష్ మాత్రం పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనపడబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రస్తుతం, గతంలో కథ నడవనుంది. తమిళ్ ట్రైలర్ చూస్తుంటేనే చాలా ఆసక్తిగా ఉంది. త్వరలోనే తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సైరన్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Also Read : ముగ్గురు స్టార్స్ కలిసిన వేళ.. నవ్వుల మేళా.. వైరల్ అవుతున్న ఫొటో..

సైరన్ సినిమాలో సముద్రఖని, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండగా GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ తమిళ్ లో ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. త్వరలో తెలుగులో కూడా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.