Hari Hara Veera Mallu: టార్గెట్ సంక్రాంతి.. పండుగ బరిలోకి హరిహర వీరమల్లు.. నిజమేనా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Hari Hara Veera Mallu Targets For Sankranti Release

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతున్నా, ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాలేదు. భారీ వ్యయంతో, అదిరిపోయే క్యాస్టింగ్‌తో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Hari Hara Veera Mallu: వీరమల్లు సైలెంట్ కావడంతో అభిమానుల్లో మళ్లీ కన్ఫ్యూజన్..?

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్‌ను ముగించేందుకు పవన్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు మరో 40 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ప‌వ‌న్ కల్యాణ్ జూన్‌‌లో వీర‌మ‌ల్లుకి కాల్షీట్లు ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించేయాలని దర్శకుడు క్రిష్ అండ్ టీమ్ చూస్తోంది.

Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం మరో హీరో వస్తున్నాడా..?

అన్నీ పనులను ముగించుకుని, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను డిసెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ లెక్కన హరిహర వీరమల్లు సంక్రాంతి బరిలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చిత్ర వర్గాలు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, వపన్ కల్యాణ్‌ను నెవర్ బిఫోర్ గెటప్‌లో చూడనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.