Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ ఈ సినిమాలో “వీరమల్లు” పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తుంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Pawan Kalyan: మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్..
17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కొన్ని సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనున్నాయి. కాగా ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రను పోషించేందుకు బాలీవుడ్ ప్రముఖ విలన్ అర్జున్ రాంపాల్ ఎంపిక చేయగా.. ఇప్పుడు ఆ పాత్రని మరో బి-టౌన్ నటుడు రీప్లేస్ చేయబోతున్నాడట.
పవన్ రాజకీయ వ్యవహారాల వల్ల సినిమా షూటింగ్ లేటు అవుతూ వస్తుంది. దీంతో మిగతా నటీనటుల కాల్ షీట్లకు ఇది ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా అర్జున్ రాంపాల్ తనకు ముందస్తు కమిట్మెంట్లు ఉన్నందున ఈ సినిమా షూట్లో జాయిన్ అవ్వలేనని తెలియజేసినట్లు సమాచారం. దానితో క్రిష్ ఇప్పుడు ఆ పాత్ర పోషించడానికి బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.