Harihara Veeramallu pressmeet Pawan Kalyan praises nidhhi agerwal
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. జూలై 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు హైదరాబాద్‌లో స్పెషల్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు.
ఈ చిత్రంలో కథానాయిక అయిన నిధి అగర్వాల్ పై పవన్ ప్రశంసం వర్షం కురిపించారు. ‘సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినా కూడా నిధి ఒక్కసారి కూడా విరామం లేకుండా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. సింగిల్ హ్యాండిల్‌గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఇది చాలా గొప్ప విషయం.’ అని పవన్ కొనియాడాడు.
ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని కొంత భాగాన్ని క్రిష్ తెరకెక్కించారు. అయితే.. కొన్నికారణాల వల్ల ఆయన తప్పుకోగా నిర్మాత రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించారు.