Harish Shankar
Harish Shankar : మాస్ మహారాజ రవితేజ గత కొన్నాళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. వరుస ఫ్లాప్స్ రావడంతో ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. ఇలాంటి టైంలో రవితేజ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో జనవరి 14న వస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది.(Harish Shankar)
రవితేజకు మాస్ మహారాజ అనే ట్యాగ్ పెట్టింది హరీష్ శంకర్ అని అందరికి తెలిసిందే. అయితే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజకు మాస్ మహారాజ ట్యాగ్ పెట్టట్లేదని, రవితేజనే తీసేయమన్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయిన హరీష్ శంకర్ దీనిపై స్పందించాడు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి రవితేజ అన్నయ్య ‘మాస్ మహారాజ’ టైటిల్ తీసేయమని అన్నారట. ఆయన అన్నారో లేదో తెలీదు కానీ సోషల్ మీడియాలో అలా వచ్చింది. మాస్ మహారాజ అనే టైటిల్ పెట్టింది నేను. దాని పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నా తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. అన్నయ్య మాస్ మహారాజ అనే పేరు ఉంచాలా తీసేయాలా అనేది మీ ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం. అది గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. దీంతో రవితేజ నిర్ణయాన్న హరీష్ శంకర్ వద్దు అన్నట్టే ప్రశ్నించాడు అని ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి సినిమాలో మాస్ మహారాజ టైటిల్ ట్యాగ్ వేస్తారా లేదా చూడాలి.
అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. మిరపకాయ్ సినిమా వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి రవితేజ. ఆయన రియల్ లైఫ్ క్యారక్టర్ నేనింతే సినిమాలో పూరీ జగన్నాథ్ పెట్టారు. సినిమా ఎలా ఉన్నా సరే ఆడిందా లేదా అని పట్టించుకోడు. నెక్స్ట్ డే షూటింగ్ కి వెళ్లిపోతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఒక విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్లాక్ బస్టర్లు వచ్చినప్పుడు పొంగిపోకు ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకు అని చెప్పాడు. రవితేజ భగవద్గీత చదువుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ దాన్ని తెలుగులో స్థితప్రజ్ఞత అంటారు. ఈ క్వాలిటీ నేను ఇద్దరిలో మాత్రమే చూసా. పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ సేమ్ క్వాలిటీ రవితేజలో చూశా. ఏ ముహూర్తాన ఈ క్వాలిటీ అలవర్చుకున్నారో తెలియదు కానీ అది మాలాంటి వాళ్లందరికీ నేర్పించారు.
ఈ బ్యాలెన్స్ మైండ్ కోసం హిమాలయాల్లోకి వెళ్తారు. ఫిలిం నగర్ లో అన్నయ్య ఆఫీస్ కి వస్తే చాలు. ఆయనతో నా చివరి సినిమా సరిగ్గా ఆడలేదు. కొంచెం డిజప్పాయయింట్ చేసింది. అక్కడితో ఆగిపోను. మళ్ళీ రవితేజతో కచ్చితంగా బ్లాక బస్టర్ ఇస్తాను. ఆయనతో సినిమా చేస్తాను. ఇది నాకు నేను చేసుకున్న ప్రామిస్ అని తెలిపారు. దీంతో రవితేజతో హరీష్ శంకర్ మరో సినిమా తీస్తారని క్లారిటీ ఇచ్చేసారు.
Also Read : Rajasaab Collections : ప్రభాస్ ‘రాజాసాబ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?