స‌పోర్ట్ చేసిన వారందరికి థ్యాంక్స్.. హ‌రీష్ శంక‌ర్ ఎమోషనల్ ట్వీట్

  • Publish Date - September 21, 2019 / 05:16 AM IST

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’‌‌ శుక్రవారం (20, 2019)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందుకు వాల్మీకి అనే టైటిల్‌ ని మార్చమని హైకోర్ట్ నుంచి నోటీసులు రావ‌డంతో చివ‌రి నిమిషంలో వాల్మీకి అనే టైటిల్‌ ని గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ గా మార్చారు. 

అయితే అప్ప‌టి వ‌ర‌కు వాల్మీకిగా ప్ర‌చారం జ‌రుపుకున్న మూవీ టైటిల్ ని మార్చడంతో మూవీ యూనిట్ తెగ ఆందోళ‌న చెందారు. సినిమా క‌లెక్ష‌న్స్‌కి ఏమైన ఎఫెక్ట్ ప‌డుతుందా అని టెన్షన్ పడ్డారు. కాని సినిమాకి వ‌స్తున్న టాక్ చూసి మేక‌ర్స్ చాలా సంతోషించారు. 

ఈ సందర్భంగా హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ.. మీడియా, త‌న మిత్రులు, అభిమానుల స‌పోర్ట్‌ తో సినిమా ఇంత మంచి విజ‌యం సాధించింద‌ని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా చూసిన వారితో పాటు మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేసిన వారందరికి చాలా థ్యాంక్స్ అని తెలిపారు. అంతేకాదు  ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియా ఇచ్చిన విలువైన రివ్యూస్ మాకు చాలా ప్రేర‌ణ ఇచ్చాయి అని హ‌రీష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.