×
Ad

Ustaad Bhagat Singh : పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ పనులు మొదలు!

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు తరువాత పవన్, హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఒక గుడ్ న్యూస్..

  • Published On : March 11, 2023 / 07:42 AM IST

Harish Shankar starts Ustaad Bhagat Singh movie works

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌ల విషయంలో వేగం పెంచేశాడు. మొన్నటి వరకు హరి హర వీరమల్లు చిత్రీకరణలో పాల్గొన్న పవన్.. ఇటీవలే వినోదయ చిత్తం రీమేక్ స్టార్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ని నెలలో కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఉస్తాద్ భగత్ సింగ్ ని పట్టాలు ఎక్కించనున్నాడని తెలుస్తుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు తరువాత పవన్, హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Pawan Kalyan: ఉగాది గిఫ్ట్‌ను రెడీ చేస్తోన్న పవన్.. వీరమల్లు కాదండోయ్!

కాగా హరీష్ శంకర్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో వేగం పెంచేశాడు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ఒక భారీ సెట్ ని నిర్మించబోతున్నారు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ బోస్ తో కలిసి హరీష్ శంకర్ దగ్గర ఉండి సెట్ నిర్మాణ పనులు చూసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది అంటూ తెలియజేశారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ మూవీ షూటింగ్ మొదలు అవుతుందా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులను ఈ న్యూస్ సంతోష పరుస్తుంది.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ అంటూ గతంలో వార్తలు వచ్చాయి. దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ సోషల్ మీడియాలో ఆ రీమేక్ వద్దు అంటూ హరీష్ శంకర్ ని బాగా ట్రోల్ చేశారు. దీంతో రీమేక్ వార్త పై క్లారిటీ ఇచ్చేది లేదు, విడుదల అయ్యాక చూసుకోండి అంటూ హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యాడు. మరి ఈ సినిమా రీమేక్? లేదా కొత్త కథ? తెలియాలి అంటే రిలీజ్ వరకు చూడాల్సిందే.