Band Melam: కోర్టు జంట కొత్త సినిమా.. బ్యాండ్ మేళం టైటిల్ గ్లింప్స్ రిలీజ్

చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు(Band Melam). నేచురల్ స్టార్ నాని నిర్మిచిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించాడు.

Harsh Roshan, Sridevi band Melam Movie Title glimpse released

Band Melam: చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్ స్టార్ నాని నిర్మిచిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించాడు. ఫోక్సో చట్టం బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. సినిమాలో కథ ఎంత బలంగా ఉన్నా నటీనటులు కూడా అంతే బలంగా ఆ పాత్రలను పోషించాలి. ఆ విషయంలో హర్ష రోషన్, శ్రీదేవి అద్భుతం అనే చెప్పాలి. ఈ ఇద్దరు తమ సహజమైన నటనతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.

Mahesh Babu: దయచేసి నువ్వు స్విచ్ ఆఫ్ చేయొద్దు.. ఎక్కడికీ వెళ్లొద్దు.. లిటిల్ హార్ట్స్ టీంపై మహేష్ ఇంటరెస్టింగ్ పోస్ట్

అందుకే, ఈ జోడీపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేయడానికి ఈ జంట మరోకొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే “బ్యాండ్ మేళం”(Band Melam). దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజమ్మ అంటూ యాదగిరి పిలిచే పిలుపుతో ఈ గ్లింప్స్ మొదలయ్యింది. తరువాత బావ మరదళ్ల సంభాషణతో సాగింది. నీ కోసం కొత్త ట్యూన్ చేసిన అని యాదగిరి అనగా.. నాకోసమా.. సరే షురూ జెయ్.. అని రాజమ్మ అంటుంది. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాకా ఇనిపిస్తది చూడు.. అంటాడు. పక్కా తెలంగాణ యాసలో సాగిన ఈ సంభాషణ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

ఈ గ్లింప్స్ కి విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. కోర్ట్ సినిమాకి కూడా విజయ్ బుల్గానిన్ తన సోల్ ఫుల్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఇపుడు మరోసారి ఈ ముగ్గురు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు మనముందుకు వస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.