Has Mahesh Babu bought a new iPhone
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం స్టార్ట్ చేసారు. ఇక ఇటీవల రాజమౌళి సైతం ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ను వెతుకుతునట్టు తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంతేకాకుండా మహేష్ బాబు సైతం రాజమౌళి సినిమా కోసం తన లుక్ మొత్తం మార్చేశాడు.
Also Read : Kanguva : సూర్య కోసం రాబోతున్న రాజమౌళి.. నేడే కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్..
అయితే తాజాగా మహేష్ బాబు ఓ ఐ ఫోన్ ఫోటోను సోషల్ మీడియాలో స్టోరీ పెట్టాడు. ఐ ఫోన్ 16 ప్రో మాక్స్.. అని ట్యాగ్ చేస్తూ మేడ్ ఇన్ ఇండియా అని రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. నిజానికి ఈ ఫోన్ లాంచ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. . కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పుడు ఈ ఫోన్ ఫోటో ను షేర్ చెయ్యడంతో.. ఆయన ఈ ఫోన్ కొన్నాడా.. లేక ప్రమోషన్ కోసం పెట్టారా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మహేష్ ఈ ఫోన్ కొన్నారని అంటున్నారు.
ఇక RRR వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు మహేష్ బాబు సైతం ఇటీవల గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.