Kanguva : సూర్య కోసం రాబోతున్న రాజమౌళి.. నేడే కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్..

Rajamouli coming for Suriya Kangua movie pre release event
Kanguva : తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా కంగువా. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా లెవల్ లో వస్తున్న ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తుంది.
కంగువా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ సైతం పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు మేకర్స్. అంతేకాకుండా ఇటీవల తెలుగులో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 7న నిర్వహించనున్నారని తెలిపారు. ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ లో కేవలం చిత్ర బృందమే కనిపించింది. కానీ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం బోయపాటి శ్రీను, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధులుగా వస్తున్నారు.
Also Read : Raha Birthday : రాహా పుట్టినరోజు స్పెషల్.. ఆలియా ఎమోషనల్ పోస్ట్ వైరల్..
ఇకపోతే ఇప్పటికే సూర్యతో ఓ సినిమా చేస్తానని బోయపాటి శ్రీను ఒక ఈవెంట్ లో తెలిపారు. మరి ఆ సినిమా ఉందా లేదా అన్న క్లారిటీ మాత్రం లేదు. చనువుతోనే బోయపాటి శ్రీను, రాజమౌళి ఈ ఈవెంట్ కి వస్తున్నట్టు తెలుస్తుంది.