Haseena : అడవిశేష్ చేతుల మీదుగా.. కొత్త సినిమా హసీన టీజర్ రిలీజ్

ఈ టీజర్ రిలీజ్ చేసిన అనంతరం అడవిశేష్ మాట్లాడుతూ.. హసీనా అనేది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని, 84 మంది కొత్త నటీనటులతో ఈ సినిమా రూపొందించడం విశేషమని.................

Haseena Movie Teaser Released

Haseena :  ప్రియాంక డే టైటిల్ రోల్‌లో సాయితేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీన. ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఒక నిమిషం 41 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. స్నేహితులు చివరిదాకా వెంటే ఉంటారు కానీ అన్ని సమయాల్లో మాత్రం కాదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్.. యూత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఒక మనిషిని చంపాలంటే ఆయుధబలం అవసరం లేదు బుద్ధి బలం ఉంటే చాలు అనే డైలాగ్ ఈ మూవీ కథలో కొత్తదనాన్ని తెలుపుతోంది. ఇక చివరగా.. నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తగి ఉండాలి లేక మేధావి అయినా అయి ఉండాలి అని చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది.

ఈ టీజర్ రిలీజ్ చేసిన అనంతరం అడవిశేష్ మాట్లాడుతూ.. హసీనా అనేది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని, 84 మంది కొత్త నటీనటులతో ఈ సినిమా రూపొందించడం విశేషమని చెప్పారు. టీజర్ చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Lokesh – Brahmani : బ్రాహ్మణి, లోకేష్ ది ప్రేమ వివాహమా?

అంతకుముందు ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను విడుదల చేశారు యంగ్ హీరో నిఖిల్. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ అంచనాలు క్రియేట్ చేసింది. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్, మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.