Lokesh – Brahmani : బ్రాహ్మణి, లోకేష్ ది ప్రేమ వివాహమా?

లోకేష్ ని మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిందా అని బాలకృష్ణ అడగడంతో చంద్రబాబు మీకు తెలీదా అన్నారు. ఏమో మనకి తెలీకుండా ఇంకా స్టోరీ ఉందేమో అని బాలకృష్ణ అంటే చంద్రబాబు....................

Lokesh – Brahmani : బ్రాహ్మణి, లోకేష్ ది ప్రేమ వివాహమా?

chandrababu reveals brahmani and lokesh marraige secret

Lokesh – Brahmani :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. అలాగే లోకేష్ కూడా రావడంతో లోకేష్ కి సంబంధించిన పలు విషయాలని కూడా ప్రస్తావించారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో లోకేష్-బ్రాహ్మణి పెళ్లి గురించి మాట్లాడారు.

బాలయ్య మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఇంటికొచ్చి అన్ని నాది నాది అంటే తిట్టేవాడ్ని అలాగే అని అని ఇప్పుడు బ్రాహ్మణిని తీసుకెళ్లిపోయాడు అని అన్నారు. లోకేష్.. మీరు చిన్నప్పుడు ర్యాగింగ్ చేసేవారు. నాది నాది అంటే తిట్టేవారు అందుకే బ్రాహ్మణిని తీసుకెళ్ళాను. బ్రాహ్మణి కూడా నాదే అని బాలయ్య అనడంతో అందుకే ఆ డైమండ్ నాకు ఇచ్చేశారు అన్నారు లోకేష్.

Lokesh : పెద్ద వివాదంగా మారిన ఫారిన్ ఫోటోపై స్పందించిన లోకేష్.. ఎన్ని ట్రోల్స్ చేసినా..

లోకేష్ ని మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిందా అని బాలకృష్ణ అడగడంతో చంద్రబాబు మీకు తెలీదా అన్నారు. ఏమో మనకి తెలీకుండా ఇంకా స్టోరీ ఉందేమో అని బాలకృష్ణ అంటే చంద్రబాబు.. మొదట భువనేశ్వరి నాతో అంది, నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను, తర్వాత బ్రాహ్మణిని అడిగితే చదువుకోవాలి ఇప్పుడే పెళ్లి వద్దు అంది. తర్వాత లోకేష్ వెళ్లి బ్రాహ్మణిని ఒప్పించాడు అని చెప్పడంతో బాలయ్య ఏమని చెప్పి బ్రాహ్మణిని ఒప్పించావు అంటే కలిసి చదువుకుందాము అని చెప్పి ఒప్పించాను అన్నాడు లోకేష్. అయితే లవ్ మ్యారేజ్, చదువుని అడ్డం పెట్టుకొని ఒప్పించావు అని నవ్వుతూ అన్నారు బాలయ్య.