Unstoppable with NBK : అన్‌స్టాపబుల్ నెక్ట్స్ ఎపిసోడ్ ప్రోమో చూసారా?
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. టాలీవుడ్ అందమైన తారలు, డైరెక్టర్లు గెస్టులుగా వచ్చిన ఈ ఎపిసోడ్ ప్రోమోకి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది.
- Lakshmi 10tv
- Updated on- December 15, 2023 / 11:03 AM IST
Unstoppable with NBK
Unstoppable with NBK : నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తున్నారు. రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘యానిమల్’ మూవీ టీమ్ ఎపిసోడ్ తర్వాత వస్తున్న కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమో చూడగానే ఎపిసోడ్‌పై జనాలకు ఆసక్తి పెరిగిపోయింది.
Shreyas Talpade : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నారు. ఏ షోకి మునుపెన్నడూ లభించనంత ఆదరణ ఈ షోకి లభిస్తోంది. ప్రతి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనదైన మాటల చాతుర్యంతో గెస్ట్‌లను ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను నవ్విస్తూ బాలకృష్ణ దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘యానిమల్’ మూవీ టీమ్‌తో ఓ ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా తాజాగా మరో ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈసారి గెస్ట్‌లు గా సీనియర్ నటి సుహాసిని, శ్రియ, డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ వస్తున్నారు.
Varun Tej : హనీమూన్ కంప్లీట్.. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసిన మెగా హీరో
ప్రోమోలో బాలకృష్ణ ‘సుహాసినీ.. మనది జన్మజన్మల బంధం.. నాది శ్రియాది ఈ మిలీనియం బంధం’ అన్నారు. సుహాసినీ ‘అప్పుడు బాలా చాలా షై’ అనగానే హరీష్ శంకర్ నేను నమ్మట్లేదు అన్నారు నవ్వుతూ. బాలకృష్ణ ‘కావాలనే మీ ముగ్గురితో మాట్లాడుతున్నాను హరీష్ ని అవాయిడ్ చేస్తున్నాను’ అన్నారు. ‘ఏం..బాబు’ అని జయంత్ అడగ్గానే..’మాకు మాకు పాత కక్షలు ఉన్నాయయ్యా’ అన్నారు బాలకృష్ణ నవ్వుతూ. బాలకృష్ణ హరీష్ ని ‘ఏంటి హాలీడేసా ఫ్రీగా ఉన్నావు?’ అని ప్రశ్నించారు. వెంటనే హరీష్ ‘ఈ గ్యాప్ మటుకే వెకేషన్.. సినిమా రిలీజైన తర్వాత సెన్సేషన్’ అన్నారు. ఇక సుహాసినీ, జయంత్, హరీష్ శంకర్ బాలకృష్ణని కూడా ప్రశ్నలు వేసారు. బాలకృష్ణ మాటల పంచులు.. గెస్టుల కబుర్లు, డ్యాన్సుల సందడితో ప్రోమో ఓ రేంజ్ లో ఉంది. ఈ కొత్త ఎపిసోడ్ డిసెంబర్ 22 న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
