Mirai : తేజ సజ్జ బర్త్డే.. ‘మిరాయ్’ నుంచి సూపర్ అప్డేట్..
‘హను-మాన్’ మూవీ భారీ విజయంతో మంచి జోష్లో ఉన్నాడు తేజ సజ్జ
- Thota Vamshi Kumar
- Updated on- August 23, 2024 / 12:57 PM IST
HBD Teja Sajja Super update from Mirai movie
Mirai : ‘హను-మాన్’ మూవీ భారీ విజయంతో మంచి జోష్లో ఉన్నాడు తేజ సజ్జ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ ‘మిరాయ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. నేడు (ఆగస్టు 23) తేజ సజ్జ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు మూవీ యూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సజ్జ పై నుంచి కిందపడిపోతుండగా కింద ఉన్న బిల్డింగ్లు కూలిపోతున్నాయి. ఏదో మంత్రించిన కర్ర లాంటి వస్తువు ఆయన పట్టుకున్నట్లుగా ఉంది. మొత్తానికి ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
Megha Akash : కుర్రాళ్లకు షాక్.. ప్రియుడితో హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్
ఇక ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా కనిపించనున్నాడు. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
