Megha Akash : కుర్రాళ్ల‌కు షాక్‌.. ప్రియుడితో హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైర‌ల్

టాలీవుడ్ ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్ కుర్రాళ్ల‌కు షాకిచ్చింది.

Megha Akash : కుర్రాళ్ల‌కు షాక్‌.. ప్రియుడితో హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైర‌ల్

Megha Akash engaged to Saai Vishnu

Updated On : September 14, 2024 / 12:23 PM IST

Megha Akash – Saai Vishnu : టాలీవుడ్ ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్ కుర్రాళ్ల‌కు షాకిచ్చింది. ఎలాంటి హ‌డావుడి లేకుండా తాను ప్రేమించిన వ్య‌క్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఆగ‌స్టు 22న ఈ ఈ వేడుక‌ జ‌రిగిన‌ట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మ‌డికి కాబోయే భ‌ర్త పేరు సాయి విష్ణు. నెట్టింట ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైర‌ల్‌గా మారగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు నెటిజ‌న్లు.

చెన్నైలో పుట్టింది మేఘా ఆకాశ్‌. నితిన్ హీరోగా న‌టించిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యమైంది. ‘ఛల్ మోహన రంగ, ‘డియర్ మేఘ’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘ప్రేమదేశం’, ‘రావణాసుర’ వంటి సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌దైన ముద్ర వేసింది.

Demonte Colony 2 : ‘డీమాంటీ కాలనీ 2’ మూవీ రివ్యూ.. ఈ హారర్ సీక్వెల్ భయపెట్టిందా?

తెలుగులో అనుకున్న పేరు రాక‌పోయిన‌ప్ప‌టికి త‌మిళంలో వ‌రుస సినిమాల్లో న‌టించింది. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా స‌రే సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండేది.

గత కొన్నిరోజుల నుంచి అమ్మ‌డు ప్రేమ‌లో ఉంద‌ని అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై మాత్రం ఎప్పుడూ స్పందించ‌లేదు. స‌డెన్ గా ఎంగేజ్‌మెంట్ ఫోటోల‌ను పోస్ట్ చేసి షాకిచ్చింది అమ్మ‌డు. కాగా.. త‌మిళ‌నాడుకు చెందిన ఓ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడి కొడుకే ఈ సాయి విష్ణు అని తెలుస్తోంది.

Kiran Abbavaram: గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్‌ల‌ వివాహం.. వీడియోలు వైరల్

 

View this post on Instagram

 

A post shared by Megha Akash (@meghaakash)