Kiran Abbavaram: గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్‌ల‌ వివాహం.. వీడియోలు వైరల్

2019లో రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్ గా నటించారు.

Kiran Abbavaram: గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్‌ల‌ వివాహం.. వీడియోలు వైరల్

Tollywood Actor Kiran Abbavaram - Rahasya Gorak Wedding

Updated On : August 23, 2024 / 7:14 AM IST

Kiran Abbavaram – Rahasya Gorak Wedding : హీరో కిరణ్ అబ్బవరం – హీరోయిన్ రహస్య గోరక్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం గురువారం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్దతుల్లో వీరి వివాహం జరిగింది. కర్ణాటక రాష్ట్రం కూర్గ్ లోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారని తెలిసింది. అబ్బవరం, రహస్య గోరక్ ల పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Rashmika Mandanna Sister : రష్మికకు ఇంత క్యూట్ చిన్ని చెల్లి ఉందని తెలుసా? ఏకంగా 16 ఏళ్ళు గ్యాప్..

2019లో రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తరువాత ప్రేమగా మారింది. అంతకుముందు వీరిద్దరు సాప్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేశారు. అయితే నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాలో ప్రేమికులుగా నటించిన కిరణ్, రహస్యలు.. నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ల జంటకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.