Hebah Patel Isha movie Glimpse out now
Isha Glimpse : హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఈషా. శ్రీనివాస్ మన్నె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. HVR ప్రొడక్షన్స్ బ్యానర్ పై పోతుల హేమ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతాన్ని అందిస్తుండగా బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు.
డిసెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఇక ఈ చిత్ర గ్లింప్స్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది.