Hebba Patel: కమిట్మెంట్స్ వద్దు ఎంజాయ్ చేయడమే ముద్దు.. టీజర్ తో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్!

గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం B&W (బ్లాక్ & వైట్). తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్, రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించింది. చిత్ర టైటిల్‌కు తగ్గటే..

Hebba Patel movie teaser released by legendary writer Vijayendra Prasad

Hebba Patel: గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం B&W (బ్లాక్ & వైట్). పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎస్‌ఆర్ ఆర్ట్స్/ ఏ యూ అండ్ ఐ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సహకారంతో ఎ మేఘనా రెడ్డి సమర్పిస్తున్నారు. ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్, రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. టీజర్‌ను లాంచ్ చేసిన అనంతరం.. మూవీ సక్సెస్ కావాలని ఆయన ఆకాక్షించారు.

Hebba Patel: అబ్బా.. ఇన్‌స్టాలో మంటపెడుతున్న హెబ్బా!

ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించారు. చిత్ర టైటిల్‌కు తగ్గటే.. ట్రైలర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. ‘‘నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సూర్య శ్రీనివాస్‌తో సహా చాలా పాత్రలను టీజర్‌లో అనుమానాస్పద రీతిలో చూపించారు. లహరి, నవీన్ నేని పాత్రలను కూడా టీజర్‌లో చూపించారు.

ఉత్కంఠభరితమైన ఈ టీజర్.. థ్రిల్లర్ సినిమా ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో యువతకు నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. టీజర్‌ కట్‌తో దర్శకుడు సూర్య ప్రకాష్‌ ఆసక్తిని రేకెత్తించాడు. టీజర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టి సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతోంది., అజయ్ అరసాడ సంగీతం అందించారు. బి&డబ్ల్యూ (బ్లాక్ & వైట్) చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.