Hero Aadi Sai Kumar doing his next movie under Hasya Movies banner
Aadi Saikumar: ఒక హిట్టు.. ఒకే ఒక హిట్ హీరో అది సాయి కుమార్ ఫేట్ మార్చేసినట్టుగా అనిపిస్తోంది. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అది సాయి కుమార్. కానీ, ఆ తరువాత ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా ఇవ్వలేకపోయాడు. ఈ 14 ఏళ్లుగా హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు రీసెంట్ గా విడుదలైన శంబాల సినిమాతో హిట్ అందుకున్నాడు. సూపర్ నేచురల్ తథ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను చాలా బాగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన కథ, ట్విస్టులతో కూడిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో కెరీర్ లో మరో సూపర్ హిట్ అందుకున్నాడు అది సాయి కుమార్.
Christmas Movies: క్రిస్మస్ సినిమాల కలెక్షన్ డీటెయిల్స్.. టాప్ లో ఆ సినిమానే.. అస్సలు ఉహిచలేదుగా..
అయితే, ఈ ఒక్క హిట్ తో మరి క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టేశాడు అది సాయి కుమార్(Aadi Saikumar). ఆ క్రేజి ఆఫర్ ఇచ్చిన బ్యానర్ మరేదో కాదు హాస్య మూవీస్ బ్యానర్. ఈ మధ్య కాలంలో హాస్య మూవీస్ నుంచి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు నిర్మాత రాజేష్ దండ. సమజవరగమనా, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, బచ్చల మల్లి, ఊరు పేరు భైరవకోన రీసెంట్ గా కె-రాంప్. అన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ బ్యానర్ లో నెక్స్ట్ సినిమాను అది సాయి కుమార్ తో చేయనున్నట్టుగా ప్రకటించాడు రాజేష్ దండ. రీసెంట్ గా ఆయన శంబాల మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అది సాయి కుమార్ తో సినిమా చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశాడు. తమ గత సినిమాల లాగే ఈ సినిమా కూడా ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో వస్తుందని, దీనికి సంబంధించిన దర్శకుడు, మిగతా వివరాలను త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పాడు. దీంతో, అది సాయి కుమార్ నెక్స్ట్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే శంబాల మూవీతో జోష్ లో ఉన్న అది సాయి కుమార్ కి ఈ సినిమా కూడా హిట్ పడింది అంటే దశ తిరిగినట్టుగానే చెప్పుకోవాలి.