Hero Adivi Sesh makes interesting comments on dancing
Adivi Sesh: సినిమా హీరో అంటే అన్ని విషయాల్లో రాణించాలి. యాక్టింగ్, ఫైట్స్, డాన్స్, రొమాన్స్ ఇలా చాలా రకాల ఎలిమెంట్స్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, అడివి శేష్ మాత్రం తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కసారి ఆ పని చేయలేదట. అది విన్న ఆడియన్స్ సైతం(Adivi Sesh) ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. హీరో అంటే అన్నీ చేయాలి కదా మేము కూడా గమనించలేదు ఆ ఎలిమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎలిమెంట్ మరేదో కాదు డాన్స్. అవును, అడివి శేష్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా, ఒక్క సినిమాలో కూడా డాన్స్ చేయలేదట.
ఏ జన్మ పుణ్యమో ఇది.. సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ పోస్ట్
దానికి కారణం, ఆయన రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటాడు. మొదటి సినిమా కిస్ నుంచి ఆయన నటించిన గత చిత్రం మేజర్ వరకు ఒక్క సినిమాలో కూడా ఆయన డాన్స్ చేయలేదట. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు ఈ హీరో. అందుకే ఆయనకు సినిమాల్లో డాన్స్ చేసే అవకాశం రాలేదు. అయితే, మొదటిసారి ఒక సినిమా కోసం డాన్స్ చేస్తున్నాడట అడివి శేష్. అదే డెకాయిట్. ఇది కూడా రొటీన్ కి భిన్నంగా ఉండే కథనే. కానీ, ఒక సాంగ్ లో మాత్రం చిన్నగా డాన్స్ చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో పంచుకున్నాడు ఈ హీరో.
రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు అడివి శేష్. “నేను నా కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా డాన్స్ చేయలేదు. నాకు ప్రస్తుతం చాలా జ్వరంగా ఉంది. అయినా కూడా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ నచ్చి ఈ ఈవెంట్ కి వచ్చాను. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.