×
Ad

Akshay Kumar: నా కూతురు నగ్న చిత్రాలు అడిగారు.. తెలియకుండానే ఆ ఉచ్చులో.. అక్షయ్ కుమార్ కామెంట్స్ వైరల్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన కూతురికి జరిగిన ఒక (Akshay Kumar)బాధాకరమైన సంఘటన గురించి వివరించారు. తాజాగా ఆయన ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్నారు.

Hero Akshay Kumar made shocking comments about cyber criminals

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన కూతురికి జరిగిన ఒక బాధాకరమైన సంఘటన గురించి వివరించారు. తాజాగా ఆయన ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సైబర్ నేరాల గురించి (Akshay Kumar)మాట్లాడుతూ తన ఫ్యామిలీలో జరిగిన ఒక సంఘటన గురించి వివరించారు. అక్షయ్ మాటలు విన్నాక చాలా మంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక సంఘటన జరిగింది. దాని గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు నా కూతురు ఆన్‌లైన్‌ వీడియో గేమ్ ఆడుతోంది. ఆ సమయంలో తనకి ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావ్‌ అంటూ మంచిగానే మొదలుపెట్టాడు.

Ravi Teja 76: రవితేజ సినిమా పేరు మారింది.. ఇప్పుడు ‘అనార్కలి’ కాదు.. కొత్త టైటిల్ భలే ఉందిగా!

ఆ తరువాత తన ఆమె పేరు చెప్పగానే తన జెండర్ అర్థం చేసుకున్నాడు. కాసేపటికి అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూ. ఆ మెసేజ్ కాస్త బెదిరించేలా ఉంది. ఆ మెసేజ్ చూడగానే నా కూతురు ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేసి, వెంటనే వెళ్లి నా భార్యతో చెప్పింది”. ఇలాంటి సంఘటనలు కూడా సైబర్‌ నేరంలో ఒక భాగం. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, పెద్దలు తెలియకుండానే ఈ సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్నారు. కాబట్టి, మహారాష్ట్రలో ఏడవ తరగతి నుంచే పిల్లలకు ఈ నేరాల గురించి అవగాహన కలిగేలా చేయాలి. అందుకోసం ప్రతి స్కూల్లో సైబర్ పీరియడ్ అని ఒక గంట సమయం కేటాయించాలి. ముఖ్యమంత్రికి ఇది నా అభ్యర్థిస్తున. ప్రస్తుత సమాజంలో సైబర్‌ నేరం వీధి నేరాల కంటే ప్రమాదంగా మారింది” అంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.