Ravi Teja 76: రవితేజ సినిమా పేరు మారింది.. ఇప్పుడు ‘అనార్కలి’ కాదు.. కొత్త టైటిల్ భలే ఉందిగా!
మాస్ మహారాజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్(Ravi Teja 76) బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

Ravi Teja-Kishore Tirumala movie title changed
Ravi Teja 76: మాస్ మహారాజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత రవితేజ సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడు. రవితేజ(Ravi Teja 76) కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది.
తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకి ముందుగా అనార్కలి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. రవితేజ టైపు మాస్ కంటెంట్ తో కాకుండా ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రానుంది. అందుకే ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ ను అనుకున్నారట. కాకపొతే తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా టైటిల్ ను చేంజ్ చేశారట. కొత్తగా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే వినూత్న టైటిల్ ను ఫిక్స్ చేశారట. కామన్ గా మైకులలో చెప్పినప్పుడు ఇలా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే మాత్రం మనం వింటూనే ఉంటాం. అలాంటి ఫన్నీ టైటిల్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేయడం చాలా కొత్తగా ఉంది. చాలా క్యాచీగా ఉంది ఉంది అంటున్నారు ఆడియన్స్.
ఇక చాలా గ్యాప్ తరువాత రవితేజ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా నేటితరం భర్తలకు కనెక్ట్ అయ్యేలా కథను సిద్ధం చేశాడట దర్శకుడు కిషోర్ తిరుమల. ఆ పాయింట్ నచ్చడంతోనే వెంటనే ఈ కథకు ఒకే చెప్పేశాడట రవితేజ. నిజానికి ఇది రవితేజ జానర్ కాదు. కానీ, కిషోర్ తిరుమల చెప్పిన కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట రవితేజ. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, అషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.