Rahul Ramakrishna: కేసీఆర్ కంబ్యాక్.. గాంధీ అసలు మహాత్ముడే కాదు.. సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ తో అకౌంట్ డిలీట్..
టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావించిన ఆయన ఎక్స్ వేదికగా వరుస ట్వీట్స్ వేశారు.

Actor Rahul Ramakrishna made shocking tweets on KCR and Mahatma Gandhi
Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావించిన ఆయన ఎక్స్ వేదికగా వరుస ట్వీట్స్ వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. (Rahul Ramakrishna)దాంతో ఈ నటుడు చేసిన ట్వీట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
సోషల్ మీడియాలో ఆయన స్పందిస్తూ.. “ప్రస్తుతం మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేసాడు. అలాగే.. నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి, హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్” ను ట్యాగ్ చేశాడు. అంతటితో ఆగకుండా.. “గాంధీ సాధువు కాదు.. అసలు అతను మహాత్ముడే కాదంటూ” అంటూ మరో ట్వీట్ చేసి షాకిచ్చాడు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రాహుల్ ఇలాంటి పోస్టులు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పోస్టులు పెట్టిన కొన్ని గంటల్లోనే రాహుల్ తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయడం విశేషం. అయితే, రాహుల్ రామకృష్ణ ఎందుకు ఎలాంటి పోస్టులు పెట్టాడు? తరువాత తన ఎక్స్ అకౌంట్ ను ఎందుకు డిలీట్ చేశాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.