Bomb Threat: స్టాలిన్, త్రిష ఇళ్లకు బాంబు బెదిరింపులు.. చెన్నైలో భద్రత కట్టుదిట్టం.. రంగంలోకి బాంబు, డాగ్ స్క్వాడ్
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం (Bomb Threat)రేపుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రముఖ ప్రదేశాలకు కూడా ఈ బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Bomb threats to Tamil Nadu CM Stalin and heroine Trisha's homes
Bomb Threat: తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రముఖ ప్రదేశాలకు కూడా ఈ బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఆరు రోజుల్లో ఇలా బెదిరింపులు రావడం ఇది మూడవసారి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, హీరోయిన్ త్రిష, భాజపా ప్రధాన కార్యాలయం, రాజ్ భవన్, డీజీపీ ఆఫీసుకి కూడా ఈ బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి.
Rishab Shetty: ఒకే ఒక షో పడితే చాలు అనుకున్నా.. అలాంటిది ఇవాళ.. రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్
దీంతో రాష్ట్ర, దేశ భద్రతా బలగాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ప్రతీ అంగుళం క్షుణ్ణంగా గాలిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. అలాగే, చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక, ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు సీనియర్ అధికారులు.