Hero Allari Naresh made interesting comments about Sudigadu 2
Allari Naresh: అల్లరి నరేష్.. ఈ నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో అతి తక్కువ మందికి ఉండే లక్షణం ఈ నటుడితో ఉంది అనిపిస్తుంది. అదేంటంటే, కామెడీ చిత్రాల హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. ఆయన అన్ని రకాల పాత్రలను చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఓపక్క కామెడీ సినిమాలు చేస్తూనే మరోపక్క మంచి మంచి పాత్రలు చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్(Allari Naresh) చేస్తున్న సినిమాలు అతగా ఆడటం లేదు. ఇప్పుడు సరికొత్త జానర్ లో ఆడియన్స్ ను మెప్పించేందుకు సిద్దమయ్యాడు ఈ హీరో. అదే 12A రైల్వే కాలనీ. ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mouni Roy: ఆ డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. కథ చెప్తూ హఠాత్తుగా.. అదే భయంలో..
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అల్లరి నరేష్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సుడిగాడు సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “సుడిగాడు అనేది నా కెరీర్ లో చాలా ప్రత్యేకం. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనీ చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సుడిగాడు టైం లో 1 టికెట్ పై 100 సినిమాలు చూపించాం. అది సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది.
కానీ, ఇప్పుడు కూడా అదే చేస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో, రీల్స్ లో చాలా మంది ఏవ్ కదా చేస్తున్నారు. మళ్ళీ ఈసారి చేస్తే 1 టికెట్ పై 200 సినిమాలు అనే ఉండాలి. అలానే సుడిగాడు 2ని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా కూడా త్వరలోనే ఉంటుంది”అంటూ చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్. దీంతో, ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యి.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.