Turning Point Teaser : ‘టర్నింగ్‌ పాయింట్‌’ టీజర్‌ రిలీజ్ చేసిన అల్లరి నరేష్‌..

వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్‌ హీరోగా.. హెబ్బాపటేల్‌, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘టర్నింగ్‌ పాయింట్‌’.

Hero Allari Naresh released the teaser of Turning Point movie

Turning Point Teaser : వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్‌ హీరోగా.. హెబ్బాపటేల్‌, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘టర్నింగ్‌ పాయింట్‌’. కుహన్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సెన్సేషనల్‌ మాస్‌ స్టార్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల విడుదల చేశారు.

Also Read : Samantha : ‘ఆ వ్యాధి ఉందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా’.. సమంత కామెంట్స్ వైరల్

తాజాగా నేడు ‘టర్నింగ్‌ పాయింట్‌’ సినిమా టీజర్‌ రిలీజ్ చేసారు. ఇక ఈ టీజర్ ను వెర్సటైల్‌ కథానాయకుడు అల్లరి నరేష్‌ విడుదల చేసారు. టీజర్ రిలీజ్ అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘టర్నింగ్‌ పాయింట్‌ టీజర్‌ అందర్ని ఇంప్రెస్‌ చేస్తుంది. త్రిగుణ్‌ మంచి కమర్షియల్‌ సక్సెస్‌ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించి, చిత్ర టీమ్‌ అందరికి మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను అంటూ మూవీ టీమ్ కి విషెష్ తెలిపారు.


ఇక టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో కనిపిస్తున్న ఈ టీజర్ లో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. కాగా ఇందులో త్రిగుణ్‌ (అదిత్‌ అరుణ్‌), హెబ్బా పటేల్‌, ఇషా చావ్లా, వర్షిణి, రాశి, చమ్మక్‌ చంద్ర, రంగస్థలం మహేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి నెట్టింట మంచి స్పందన లభిస్తుంది.