Samantha : ‘ఆ వ్యాధి ఉందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా’.. సమంత కామెంట్స్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

Samantha Shocking comments on her Myositis disease
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎన్నో సినిమాల్లో, ఎంతో మంది స్టార్ హీరోస్ తో నటించి భారీ స్టార్ డం సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా వరుస సినిమాల్లో నటించి బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. వెబ్ సిరీస్ సైతం చేసింది.
అయితే అలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో మాయోసైటిస్ బారిన పడింది సామ్. ఇక ఈ వ్యాధి కారణంగా సినిమాలకి కూడా లాంగ్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుండి కోలుకుంటున్న సామ్ తిరిగి సినిమాలతో బిజీ కావాలని చూస్తుంది. ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో అసలు సామ్ ఈ వ్యాధి వచ్చిందని ఎప్పుడు గుర్తించిందో తెలిపింది. ఆ రోజులను గుర్తుచేసుకుంది.
Also Read : Keerthy Suresh : చిన్ననాటి స్నేహితుడితో పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేష్..
దీని గురించి సామ్ మాట్లాడుతూ.. “కాఫీ విత్ కరణ్ షోలో ఉన్నప్పుడు చాలా నీరసంగా అనిపించింది. అయినా సరే ఆ షో పూర్తిచేసి హైదరాబాద్ వచ్చాను. తర్వాత ఖుషి షూటింగ్ కి వెళ్ళా.. షూటింగ్ లో కూడా ఎప్పుడూ నీరసంగానే అనిపిస్తుండేది. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆ వ్యాధిని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. ఆ వ్యాధి తర్వాత నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీ అందరికీ తెలుసని” పేర్కొంది సమంత. దీంతో సమంత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.