Kiran Abbavaram : మా ఆవిడ ఒప్పుకుంటే అలాంటి సినిమా చేస్తా.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

Hero Kiran Abbavaram will do such a film if his wife Rahasya Gorak agree

Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరం త్వరలోనే ‘క ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుజిత్‌, సందీప్‌ సంయుక్త దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 31న రాబోతుంది . ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ప్రమోషన్స్ సైతం పెద్ద ఎత్తున చేస్తున్నారు.

Also Read : Shraddha Kapoor : బాబోయ్.. శ్ర‌ద్దాక‌పూర్‌కి లేడీ ఫ్యాన్ ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చిందో చూడండి.. వీడియో వైరల్..

అయితే తాజాగా నెటిజన్స్ తో జరిపిన ‘ క ‘ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఓ అభిమాని ఇలా అడిగారు.. మళ్ళీ రాజా వారు రాణి గారు లాంటి క్లాస్ లవ్ స్టోరీ సినిమా మీ దగ్గరి నుండి ఊహించొచ్చా అని అడిగారు.. దానికి కిరణ్ అబ్బవరం స్పందిస్తూ.. మా ఆవిడ ఒప్పుకుంటే మళ్ళీ తనతోనే ఈ సినిమా చేస్తా అంటూ బదులిచ్చాడు. మొత్తానికి అభిమాని ప్రశ్నకి కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇవ్వడంతో రాజా వారు రాణి గారు లాంటి క్లాస్ లవ్ స్టోరీ మళ్ళీ తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్బంగా తన భార్య పై ఉన్న ప్రేమని కూడా తెలిపాడు ఈ యంగ్ హీరో.


ఇకపోతే కిరణ్ అబ్బవరం భార్య పేరు రహస్య గోరఖ్.. ఈ మధ్యే వీరి వివాహం జరిగింది. రాజా వారు రాణి గారు సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. అప్పటి నుండి రహస్య ప్రేమాయణం నడిపిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.