Laksh Chadalavada : ఆస‌క్తిని రేకెత్తిస్తున్న లక్ష్ చదలవాడ కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్

వ‌లయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.

Laksh Chadalavada New movie concept poster

వ‌లయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టించిన ధీర అనే చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ల‌క్ష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతో పాటు ల‌క్ష్ మ‌రో సినిమాలోనూ న‌టిస్తున్నారు. లక్ష్ కెరీర్‌లో ఇది ఎనిమిద‌వ చిత్రంగా రాబోతుంది.

Laksh Chadalavada New movie concept poster

ఈ చిత్రానికి ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ల‌క్ష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరో హీరోయిన్లు ఏదో ప్రమాదంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇద్ద‌రు రోడ్డు మీద వెలుతుండ‌గా.. వెనుక‌న అగ్నిజ్వాలలు చెలరేగి.. అది కాస్త మేఘాల్లా మారి.. మెదడు ఆకారంలోకి రావడం చూస్తుంటే.. ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న‌ట్లుగా అనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర‌బృందం వెల్ల‌డించ‌నుంది.

Laksh Chadalavada