నితిన్‌కు కాబోయే భార్య షాలినీ కందుకూరి ఎవరో తెలుసా!

నితిన్ పెళ్లి చేసుకోబోయే షాలినీ కందుకూరి గురించి ఆసక్తికరమైన విషయాలు..

  • Published By: sekhar ,Published On : February 16, 2020 / 07:46 AM IST
నితిన్‌కు కాబోయే భార్య షాలినీ కందుకూరి ఎవరో తెలుసా!

Updated On : February 16, 2020 / 7:46 AM IST

నితిన్ పెళ్లి చేసుకోబోయే షాలినీ కందుకూరి గురించి ఆసక్తికరమైన విషయాలు..

హీరో నితిన్ నిశ్చితార్థం షాలినితో ఫిబ్రవరి 15న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నితిన్ గత నాలుగేళ్లుగా తన స్నేహితురాలు షాలినీతో ప్రేమలో ఉన్నాడు. కామన్ ఫ్రెండ్ వల్ల ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు.

సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘పెళ్లిపనులు ఆరంభం.. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ ఆశీస్సులు కావాలి’’.. అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. అయితే నితిన్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు, ఆమె వివరాలు ఏంటనేది ఎవరికీ తెలీదు. నితిన్ సన్నిహితుల సమాచారం మేరకు ఈ నిజమాబాద్ పోరడు నాగర్‌కర్నూల్‌కు అల్లుడు కాబోతున్నాడని తెలుస్తోంది.

 

జిల్లా కేంద్రంలో రెండు దశాబ్దాలుగా ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ను నిర్వహిస్తున్న డా.సంపత్‌ కుమార్‌, నూర్జహాన్‌ల రెండవ కుమార్తె షాలినీని నితిన్‌ మనువాడబోతున్నాడు. కెరీర్‌ దృష్ట్యా వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ఇరు కుటుంబ సభ్యులు ఇరువురికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇక ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో నితిన్, షాలినీల వివాహ వేడుక నిర్వహించబోతున్నారు. ఏప్రిల్‌ 21న హైటెక్‌లో హీరో నితిన్‌ వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నరని తెలుస్తోంది.

Hero Nithin gets Marry a Girl from Nagarkarnool

Read More>>చెంప దెబ్బ కొట్టిందని పోలీస్ తల్లిని చంపేసిన మైనర్