హనుమాన్ దీక్షలో నితిన్

హనుమాన్ దీక్షలో హీరో నితిన్..

  • Publish Date - February 21, 2019 / 08:03 AM IST

హనుమాన్ దీక్షలో హీరో నితిన్..

యంగ్ హీరో నితిన్ గతకొద్ది రోజులుగా మీడియా కంట పడడం లేదు. మొన్నామధ్య భుజానికి గాయం అవడంతో కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాడు. గాయం తగ్గింది, నెక్స్ట్ వెంకీ కుడుముల డైరెక్షన్‌లో చెయ్యబోమే భీష్మ షూటింగ్‌లో పాల్గొంటాడు అనుకుంటుండగా, తన లేటెస్ట్ పిక్ పోస్ట్ చేసి, అందరికీ షాక్ ఇచ్చాడు.. నితిన్ ఇప్పుడు హనుమాన్ దీక్షలో ఉన్నాడు. హనుమాన్ దీక్ష చెయ్యడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవడం, మధురమైన శ్రీ ఆంజనేయం పాటలతో, పూజా కార్యక్రమాలతో నా రోజు మొదలైంది..

డివైన్ వైబ్స్ ఆర్ సో స్పిరుచ్వల్ రీఫ్రెషింగ్.. అని ట్వీట్ చేసాడు నితిన్. లై, ఛల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం.. వరసగా మూడు ఫ్లాప్‌ల తర్వాత వెంకీ కుడుములతో చేస్తున్న సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు నితిన్. భీష్మ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.