Rahul Vijay : హీరోయిన్స్ తో కలిసి అమెరికా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరో..

Hero Rahul Vijay enjoying American vacation with Shalini Kondepudi Shivathmika Rajashekar Shivani Rajashekar

Rahul Vijay : టాలీవుడ్ నటి, సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని, శివాత్మిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఈ ఇద్దరు భామలు తెలుగులో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నటి శివాని కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ కూడా చేసింది. సోషల్ మీడియాలో సైతం వీరిద్దరూ చాలా యాక్టీవ్ గా ఉంటారు. తమ హాట్ ఫోటోలని కూడా షేర్ చేస్తుంటారు.

Also Read : Sankranthiki Vasthunnam : 11 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.. 18 ఏళ్ల తర్వాత వెంకీ మామతో

అయితే తాజాగా శివాని, శివాత్మిక ఇద్దరూ తమ ఫ్రెండ్స్ తో అమెరికా ట్రిప్ కి వెళ్లారు. ఇక అమెరికా వెకేషన్ లో తమ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలని షేర్ చెయ్యగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో శివాని, శివాత్మిక లతో పాటు నటుడు రాహుల్ విజయ్, హీరోయిన్ షాలిని కొండేపూడి కూడా ఉన్నారు. వారితోపాటు మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ముందు నుండే శివాని, రాహుల్, షాలిని మంచి స్నేహితులు.


నటుడు రాహుల్ విజయ్ ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేసి హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే షాలిని కొండేపూడి తెలుగులో వరుస సినిమాలు చేసింది. కేవలం నటిగానే కాకుండా రచయితగా కూడా బిజీగా ఉంది. ఇక ఇప్పటికే శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కలిసి కోట బొమ్మాళి, విద్యా వాసుల అహం అనే రెండు సినిమాల్లో నటించారు. తాజాగా ఇప్పుడు వీరందరూ కలిసి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.