Sankranthiki Vasthunnam : 11 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.. 18 ఏళ్ల తర్వాత వెంకీ మామతో

star music director re entry after 11 years with Venkatesh Sankranthiki Vasthunnam movie
Sankranthiki Vasthunnam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. 2025 సంక్రాంతి రేసులో వస్తున్న ఈ సినిమాకి సంబందించిన వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.
Also Read : Kona Venkat : ఆ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగులో లేడీ డైరెక్టర్స్ తక్కువ.. ఎందుకంటే..
అయితే తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ కి సంబందించిన అప్డేట్ సైతం ఇచ్చారు మేకర్స్. దీని గురించి ఓ వీడియో రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న ఈ పాటను ప్రముఖ సింగర్ రమణ గోగుల ఆలపిస్తున్నారు. గోదారి గట్టుమీద అంటూ సాగే ఈ పాట మొదటి లైన్ కూడా పాడారు. ముఖ్యంగా ఈ పాట కోసం రమణ గోగుల ను తీసుకోవడానికి కారణం ఆయన గంభీరమైన గొంతు.
A special song calls for a very special singer to bring the magic to life❤️🔥
After 18 Long years, Bringing back the blockbuster vintage combo of Victory @VenkyMama and @RamanaGogula for a chartbuster tune composed by #BheemsCeciroleo 💥
— https://t.co/HWcxIst1F3… pic.twitter.com/LGW5gGNLUR
— Sri Venkateswara Creations (@SVC_official) November 13, 2024
ఇక మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో చూసుకుంటే.. భీమ్స్ సిసిరోలియో గోదారి గట్టుమీద అంటూ పాట స్టార్ట్ చేస్తే.. ట్యూన్ బాగుంది… ఎవరు ఈ పాట పాడితే బాగుంటుందని అనిల్ రావిపూడి అనగానే.. బంగాళా ఖాతంలో అని పవన్ కళ్యాణ్ సాంగ్ వినిపిస్తుంది. అప్పుడు అనిల్ రావిపూడి రమణ గోగుల అయితే ఈ పాట కి సరిగ్గా సరిపోతారని అంటారు. అయితే గతంలో వెంకటేష్ సినిమాలో పాటలు పాడాడు రమణ గోగుల. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 18 ఏళ్ల తర్వాత వెంకటేష్ సినిమాలో ఆయన పాట పాడుతున్నారు.