Hero Raj Tarun makes emotional comments on the controversy surrounding him
Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యూట్యూబర్ కెరీర్ స్టార్ట్ (Raj Tarun)చేసిన ఈ హీరో ఆ తరువాత ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కూడా వరుస హిట్స్ అందుకొని ప్రామిసింగ్ హీరోగా మారదు. రాజ్ తరుణ్ చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. అదే ఆయనకు ప్లస్ పాయింట్. అందుకే ఆయన సినిమాలకు ఆడియన్స్ ఈజీ గా కనెక్ట్ అయ్యారు. కుమారి 21F, ఈడోరకం.. ఆడోరకం లాంటి వరుస హిట్స్ తరువాత రాజ్ తరుణ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతాడు అనుకున్నారు అంతా.
Bison OTT: ఓటీటీకి వస్తున్న కొత్త సినిమా ‘బైసన్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?
కానీ, అనూహ్యంగా ఆయన జీవితంలో చాలా వివాదాలు తలెత్తాయి. పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇబ్బందుల కారణంగా ఆయన కెరీర్ మొత్తం డిస్టర్బ్ అయ్యింది. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ మధ్య మళ్లీ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ హీరో. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన చింరజీవ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా తరువాత రాజ్ తరుణ్ చేస్తున్న కొత్త సినిమా “పాంచ్ మినార్”.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు హీరో రాజ్ తరుణ్.. “ఈమధ్య నా గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. వాటిపై స్పందించమంది చాలా మంది నాకు చెప్పారు. కానీ, నేను ఆ వివాదం గురించి ఎక్కడ మాట్లాడలేదు. దానికి కారణం సమాధానం చెప్పలేక కాదు. వెనక్కి తిరిగిచూడటం ఇష్టం లేక. నేను స్ప్రింగ్ లాంటి వాడిని. ఎంత తొక్కితే అంత పైకి లేస్త. అంతేకాదు, ఇండస్ట్రీలో నన్ను తొక్కేయడానికి కూడా చాల ప్రయత్నాలు జరిగాయి. అది నాకు ప్రమేయం లేకుండానే”అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఈ హీరో. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.