×
Ad

Sagar: తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం.. హీరోగా సాగర్.. పాన్ ఇండియా లెవల్లో కొత్త సినిమా

సాగర్ (Sagar)అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, మొగలిరేకులో సీరియల్ లో ఆర్కే అంటే మాత్రం టక్కున గుర్తుపెట్టేస్తారు. అంతలా తన నటనతో ఆకట్టుకున్నాడు నటుడు సాగర్.

hero sagar new film is set in the backdrop of singareni coal mines

Sagar: సాగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, మొగలిరేకులో సీరియల్ లో ఆర్కే అంటే మాత్రం టక్కున గుర్తుపెట్టేస్తారు. అంతలా తన నటనతో ఆకట్టుకున్నాడు నటుడు సాగర్. చాలా గ్యాప్ తరువాత ఈ నటుడు ఇటీవలే ‘ది 100’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలోనే మరో కొత్త సినిమాను ప్రకటించాడు నటుడు (Sagar)సాగర్. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

Casting Couch: ఇండస్ట్రీలో ఓ పెద్ద నిర్మాత ఆ అమ్మాయిని మోసం చేశాడు.. నేరెళ్ల శారద షాకింగ్ కామెంట్స్

ఈ సినిమా కోసం మరో వినూత్న ప్రాజెక్ట్‌ ను ఎంచుకున్నాడు సాగర్. తెలంగాణాలోని సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి ఆవిష్కరించాలని ఫిక్స్ అయ్యాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను ‘జార్జ్ రెడ్డి’ సినిమా చేసిన దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ చెప్తున్నారు.

అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోని తీసుకోబోతోన్నట్టు తెలిపారు. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోని ప్రముఖ నటుల్ని ఈ చిత్రం కోసం తీసుకుంటున్నట్టు సూచించారు. ఇక నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టుగా టీం ప్రకటించారు.