Sai Dharam Tej : హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం.. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి..!

హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైకు నుంచి కిందపడటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.

Hero Sai Dharam Tej Inured In Road Accident

Hero Sai Dharam Tej Inured in Road accident : హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైకు నుంచి కిందపడటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. కన్ను, ఛాతి, పొట్టపై తీవ్రగాయాలు కావడంతో హుటాహుటినా హైటెక్ సిటీలోని మెడీకవర్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ అపస్మార స్థితిలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి కేబుల్ బ్రిడ్జివైపు వెళ్తుండగా.. ఐకియా షోరూం సమీపంలో తేజ్ వెళ్లే స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి కిందపడినట్టు తెలుస్తోంది.
Mumbai Nirbhaya : అత్యాచారం చేసి రాడ్ చొప్పించి.. ముంబైలో నిర్భయ తరహా దారుణం

షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందా లేదా ప్రమాదవశాత్తూ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో సాయిధరమ్‌కు చికిత్స పొందుతుండగా.. తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఐసీయూలో వెంటిలేటర్ పై తేజ్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బైక్‌పై అతివేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నరు. ప్రమాద వార్తను పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి సాయిధరమ్ తేజ్‌‌ను తరలించే అవకాశం కనిపిస్తోంది.
Ajith Kumar : అజిత్ సినిమాల డిమాండ్ మామూలుగా లేదుగా..