Ajith Kumar : అజిత్ సినిమాల డిమాండ్ మామూలుగా లేదుగా..

మన తెలుగు స్టార్ హీరోలు కోలీవుడ్ యాక్టర్ అజిత్ సినిమాల మీద ఎందుకంత మనసుపడుతున్నారో తెలుసా..!

Ajith Kumar : అజిత్ సినిమాల డిమాండ్ మామూలుగా లేదుగా..

Venkatesh

Ajith Kumar: తెలుగు హీరోలకు బాగా కలిసొస్తున్న హీరో అజిత్. తమ సినిమాలు హిట్ అవ్వడం కోసం అజిత్‌నే నమ్ముకుంటున్నారు. రీమేక్ స్పెషలిస్ట్ అయిన వెంకటేష్ మరో మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.. అదికూడా అజిత్ సినిమా రీమేక్‌తోనే. మరి ఆ సినిమా ఏంటో, మన హీరోలు అజిత్ సినిమాల మీద ఎందుకంత మనసుపడుతున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Kota Srinivasa Rao : కొత్త సినిమాలో కోట లుక్.. ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటా..

మన స్టార్ హీరోలు తమిళ్ హీరో అజిత్ మీద మనసు పడుతున్నారు. తమిళ్‌లో అటు క్లాస్ ఆడియన్స్‌తో పాటు మాస్ ఫాలోయింగ్‌ని విపరీతంగా సంపాదించుకున్న అజిత్ సినిమాల మీదే మన వాళ్లు కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. వరుసగా అజిత్ సినిమాల్ని రీమేక్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు మరోసారి అజిత్ ‘ఎంతవాడు గానీ’ సినిమా మీద మనసు పారేసుకున్నారు. ఈ సినిమాని వెంకటేష్ రీమేక్ చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది.

Stars Workout : కండల వెనుక కష్టం..

ఈ సినిమా అనే కాదు.. అజిత్ సినిమాల్నే ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు మన హీరోలు. చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా కూడా ‘వేదాళం’ కి రీమేక్‌గా వస్తున్నదే. తెలుగులో ‘ఆవేశం’ గా డబ్ అయిన ఈ సినిమాని తెలుగు నేటివిటీకి, మెగాస్టార్ ఇమేజ్‌‌కి మ్యాచ్ అయ్యేలా మేకోవర్ చేశారు మెహర్ రమేష్.

Pawan – Charan : మరో సినిమా కొన్న చరణ్.. బాబాయ్ కోసమేనా..!

మెగాస్టార్, వెంకటేష్ కాకుండా పవర్‌స్టార్ కూడా అజిత్ సినిమాల్ని రీమేక్ చేశారు. తమిళ్‌లో ‘వీరమ్’ గా సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో ‘కాటమరాయుడు’ గా తీసి డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు. తెలుగులో అనుకున్నంత సక్సెస్ రాకపోయినా.. పవన్ కళ్యాణ్ ఆడియన్స్‌కి సరికొత్తగా కనిపించారు.