Post Office Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. సింగిల్ ఇన్వెస్ట్ చాలు.. ప్రతి నెలా రూ. 6వేలు సంపాదన పక్కా.. ఎలాగంటే?
Post Office Scheme : పోస్టాఫీస్ (MIS)లో ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 6వేలు వడ్డీ ఆదాయంగా నేరుగా ఖాతాలో పొందవచ్చు.

Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. ఈ పథకంలో (Post Office Scheme) పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా రూ. 6వేలు ఆదాయాన్ని పొందవచ్చు. అదే.. పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం.. అదే.. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..
ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. ఆ తర్వాత ప్రతి నెలా స్థిర వడ్డీ పొందవచ్చు. ఈ వడ్డీ నేరుగా మీ ఖాతాలోనే జమ అవుతుంది. మీరు సర్వీసులో ఉన్నా పదవీ విరమణ చేసినా లేదా గృహిణి అయినా ఈ పథకం అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకంలో చిన్న పెట్టుబడితో కూడా దీర్ఘకాలికంగా భారీగా రాబడిని పొందవచ్చు.
వంద శాతం మీ డబ్బు సురక్షితం :
ఈ పోస్టాఫీసు పథకంలో (Post Office Scheme) మీ పెట్టుబడి వంద శాతం సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ పథకంలో చేరాలంటే మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి మీ సేవింగ్స్ అకౌంట్ సమాచారంతో పాటు మీ ఆధార్ కార్డు వివరాలను సమర్పించండి.
Read Also : Vivo T4 Pro : కొత్త వివో T4 ప్రో ఫోన్ వస్తోంది.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? :
ఈ అద్భుతమైన పథకంలో పెట్టుబడిదారులు ఒంటరిగా లేదా ఎవరితోనైనా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సింగిల్ అకౌంటులో గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంటులో రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం, ఈ పథకంపై వడ్డీ రేటు ఏడాదికి దాదాపు 7.4శాతంగా అందిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసేందుకు కనీసం రూ. 1,000 డిపాజిట్ చేస్తే సరిపోతుంది.
రూ. 10 లక్షల పెట్టుబడిపై ఆదాయం ఎంతంటే? (Post Office Scheme) :
పెట్టుబడిదారులు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో జాయింట్ అకౌంట్‌లో దాదాపు రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలి. తద్వారా ప్రతి నెలా దాదాపు రూ. 6,167 అంటే ఏడాదికి రూ. 74,004 సంపాదిస్తారు. ఈ మొత్తం నేరుగా మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంటులో క్రెడిట్ అవుతుంది.
రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనేవారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) బెస్ట్. ఈ పథకం ద్వారా ప్రతి నెలా ఫిక్స్‌డ్ వడ్డీ పొందవచ్చు. పోస్టాఫీసు పథకాన్ని మీ పేరుతో అలాగే పిల్లల పేరుతో ఓపెన్ చేయొచ్చు. 5 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు.
Disclaimer : ఈ పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఇందులో పెట్టుబడి పెట్టే ముందు ఓసారి మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.