Pawan – Charan : మరో సినిమా కొన్న చరణ్.. బాబాయ్ కోసమేనా..!

బాబాయ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ సూపర్ హిట్ సినిమా తెలుగు రైట్స్ కొన్నారు..

Pawan – Charan : మరో సినిమా కొన్న చరణ్.. బాబాయ్ కోసమేనా..!

Pawan Charan

Pawan – Charan: 60 ప్లస్ ఏజ్ అయినా.. 30 ప్లస్ ఎనర్టీతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో సూపర్ స్పీడ్ మీద ఉన్నారు. తనయుడు రామ్ చరణ్ నిర్మాణంలో.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ ఇంకా రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉండగా.. మొన్న బర్త్‌డే నాడు వరుసగా మూడు సినిమాల అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేసేశారు.

Acharya : ‘ఆచార్య’లో శ్రీశ్రీ పలుకులు.. టార్గెట్ నేషనల్ అవార్డ్..?

మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌కి ‘గాడ్ ఫాదర్’ అనే పవర్‌‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. తర్వాత బాబీతో చెయ్యబోయే మూవీకి సంబంధించి లుక్ వదిలారు. ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ టైటిల్ వినిపిస్తోంది. తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్ ఫిలింకి ‘భోళా శంకర్’ పేరు కన్ఫమ్ అని అనౌన్స్ చేశారు.
తన స్టార్‌డమ్‌తో పాటు కొత్తదనం ఉన్న సబ్జెక్ట్స్ అలాగే తెలుగులో తను రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకున్న సినిమాలకు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు చిరు.

Megastar’s GodFather: టైటిల్ పోస్టర్.. గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి!

Yennai Arindhaal

కట్ చేస్తే ఇప్పుడు చరణ్ తండ్రి కోసం మరో క్రేజీ సినిమా రీమేక్ రైట్స్ కొన్నారని.. కాదు ఆ సినిమాను బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చెయ్యబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 2015లో తమిళ స్టార్ ‘తల’ అజిత్, అనుష్క జంటగా.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ కోలీవుడ్‌లో మంచి హిట్ అవడమే కాక ‘ఎంతవాడు గాని’ పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఇందులో హీరోది పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌.. భార్యతో బాండింగ్.. కూతురితో రిలేషన్ వంటి ఎమోషన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. త్రిష సెకండ్ హీరోయిన్‌గా నటించింది.

Mega 154 : మెగా ఫ్యాన్స్.. పూనకాలు లోడింగ్..

ఈ కథ చిరంజీవికైతే సరిగ్గా సరిపోతుందని రామ్ చరణ్ తెలుగు రైట్స్ కొన్నారని, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రెస్టీజియస్‌గా నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. కట్ చేస్తే.. ఈ రీమేక్ రైట్స్ బాబాయ్ కోసం కొన్నాడనే మాట కూడా వినిపిస్తోంది. చరణ్ నిర్మాతగా గతంలోనే బాబాయ్‌తో సినిమా ఫిక్స్ అయిపోయింది. కాకపోతే అందుకు తగ్గట్టు క్రేజీ కథ, కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నారు. ‘ఎన్నై అరిందాల్’ పవన్ ఇమేజ్‌కి సూట్ అయ్యే కథ అని.. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఫిలిం నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Yentavadu Gaani

Yennai Arindhaal