Aditi Rao Hydari-Siddharth : అప్పుడు సింపుల్ గా.. ఇప్పుడు గ్రాండ్ గా.. మళ్ళీ పెళ్లి చేసుకున్న సిద్దార్థ్..

రాజస్థాన్ లోని అలీల ఫోర్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు సిద్దార్థ్,అదితి.

Hero Siddharth who got married again with Aditi Rao Hydari photos goes viral

Aditi Rao Hydari-Siddharth : హీరో సిద్ధర్థ్ గురించి తెలిసిందే. తెలుగులో వరుస సినిమాలు చేసి హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ఇప్పటికీ అదే హ్యాండ్సమ్ లుక్ లో, అదే ఎనర్జీ తో ఉన్నాడు. అయితే సిద్ధర్థ్ నటి అదితిరావుతో గతకొంత కాలంగా ప్రేమాయణం నడిపి ఇటీవల చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 16న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

Also Read : Turning Point Teaser : ‘టర్నింగ్‌ పాయింట్‌’ టీజర్‌ రిలీజ్ చేసిన అల్లరి నరేష్‌..

అయితే తాజాగా ఈ జంట ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. రాజస్థాన్ లోని అలీల ఫోర్ట్ లో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ లో అదితి రెడ్ లెహంగాలో పెళ్లికూతురి అలంకరణలో చాలా అద్భుతంగా ఉంది. సిద్ధర్థ్ సైతం పెళ్లి కొడుకుగా చాలా అందంగా కనిపించాడు. ఇక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ కపుల్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వగా చాలా మంది సినీ ప్రముఖులు తమకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఇకపోతే ఈ జంట మహాసముద్రం సినిమా టైంలో కలిశారు. అప్పటి నుండి వీరి మధ్య పెరిగిన స్నేహం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. కాగా ఇప్పటికే అదితి పూర్వీకుల ఆచారం ప్రకారం రంగనాధ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారి కోరిక మేరకు రెండో సారి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.