Hero Sudheer Babu made sensational comments at the Jatadhara movie pre-release event
Sudheer Babu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అవకాశాలు కూడా ఉన్నాయి కానీ, ఆవగింజంత అదృష్టం కరువయ్యింది. ఎప్పుడు జమానాలో (Sudheer Babu)వచ్చిన ప్రేమ కథా చిత్రం తరువాత ఒక్కటంటే.. ఒక్క హిట్ లేదు సుధీర్ బాబుకి. అయినా కూడా తనవంతు ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా సుధీర్ బాబు నుంచి వస్తున్న సినిమా జటాధర. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాను దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్నారు.
Jailer 2: జైలర్ 2 కోసం సూపర్ స్కెచ్.. స్టార్స్ తో నింపేస్తున్న నెల్సన్.. ఎంతమందో తెలుసా?
డివోషనల్ కంటెంట్ తో, భారీ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం నవంబర్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ చాలా ఆసక్తికర కామెంట్స్ చేశాడు సుధీర్ బాబు. “సుధీర్ బాబు అంటే ఎవరు అని నాలో నేను చాలా సార్లు ప్రశ్నించుకున్నా. కృష్ణ గారి అల్లుడు, మహేష్ బాబు బావ.. కామన్ గా వినిపించే సమాధానాలు ఇవే. వాటిని నేను గర్వంగా ఒప్పుకుంటున్నాను. ఇలా నిజాలు ఒప్పుకోవాలంటే గట్స్ ఉండాలి. కానీ వారి వల్ల ఇండస్ట్రీలో నాకు అదనంగా ఒక కాఫీ లభించింది అంతే. మిగతావి నేను స్వయంగా కష్టపడి సంపాదించుకున్నవే.
ఇక జటాధర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నేను దెయ్యాలను వెంటాడే వ్యక్తి పాత్రలో కనిపిస్తాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శివుడి నేపథ్యంలో వచ్చే సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఈఇలాంటి పాత్రను ఇప్పటివరకూ ఎవ్వరూ చేయలేదు” అంటూ చెప్పుకొచ్చాడు సుధేర్ బాబు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.