Sumanth – Allu Arjun : త్రివిక్రమ్, పూరి జగన్నాధ్.. ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ వచ్చి కథ చెప్తే నో చెప్పిన హీరో.. అదే కథ అల్లు అర్జున్ తీస్తే..

సినీ పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమాలు ఇంకొకరికి వెళ్లిపోతుంటాయి.

Hero Sumanth Rejected Movie done by Allu Arjun gets a Blockbuster

Sumanth – Allu Arjun : సినీ పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమాలు ఇంకొకరికి వెళ్లిపోతుంటాయి. అలా ఒకరు వద్దనుకున్న సినిమాలు వేరే హీరోలు చేసి ఒక్కోసారి హిట్స్ కొడతారు. ఒక్కోసారి ఫ్లాప్స్ చూస్తారు. ఇలా సినీ పరిశ్రమలో రెగ్యులర్ గా జరుగుతుంది. ఒక కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లొస్తుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా కూడా మొదట సుమంత్ దగ్గరకు వెళ్తే నో చెప్పాడు. ఇంతకీ అది ఏం సినిమా? ఎందుకు నో చెప్పాడో తెలుసా?

గతంలో ఓ ఇంటర్వ్యూలో సుమంత్ ఈ విషయాన్ని తెలిపాడు. సుమంత్ మాట్లాడుతూ.. నేను దేశముదురు సినిమా వదిలేసాను. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాధ్ ఇద్దరూ కలిసి వచ్చి నాకు ఈ కథ చెప్పారు. అప్పటికి ఇంకా కథ ఫుల్ గా డెవలప్ అవ్వలేదు. ఆ కథలో మెయిన్ పాయింట్ సన్యాసుల్లో కలిసిన అమ్మాయిని లవ్ చేస్తాడు హీరో. అది ఎథికల్ గా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అందుకే నేను ఆ సినిమా చేయను అని చెప్పాను అంటూ తెలిపాడు.

Also Read : Allu Brothers : అల్లు బ్రదర్స్ మొత్తం ముగ్గురు కాదు నలుగురా..? అల్లు శిరీష్ ఏం చెప్పాడంటే.. ?

2007లో సంక్రాంతికి వచ్చిన దేశముదురు సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో అల్లు అర్జున్ – హన్సిక జంటగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అప్పట్లోనే ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ కూడా చేసాడు. హన్సిక ఈ సినిమాతోనే సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.

Also See : Srinidhi Shetty : మహా కుంభమేళాలో కేజీఎఫ్ హీరోయిన్.. గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకొని.. తండ్రితో కలిసి..

మొదట్లో కొన్ని హిట్స్ కొట్టినా ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ చూసాడు సుమంత్. 2017 లో మళ్ళీ రావా అనే సినిమాతో చివరగా హిట్ కొట్టాడు సుమంత్. ఆ తర్వాత మళ్ళీ హిట్ చూడలేదు. ఓ పక్క హీరోగా సినిమాలు అడపాదడపా చేస్తూనే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు. చివరగా గత సంవత్సరం అహం రీబూట్ అనే సినిమాతో పలకరించినా అది కాస్తా ఫ్లాప్ గానే మిగిలింది. ప్రస్తుతం సుమంత్ చేతిలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా ఒకటే ఉంది.