×
Ad

Thiruveer: డబ్బులు ఇస్తేనే ఇంటర్వూస్.. నేను మోసపోతూనే ఉన్నాను.. హీరో తిరువీర్ షాకింగ్ కామెంట్స్

తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేసిన తిరువీర్(Thiruveer).

Hero Thiruveer made shocking comments about movie promotions.

  • భగవంతుడు ఈవెంట్ లో తిరువీర్ షాకింగ్ కామెంట్స్
  • డబ్బులు ఇస్తేనే ఇంటర్వ్యూలు చేస్తారా
  • ఆ విషయంలో ఇంకా మోసపోతూనే ఉన్నా అంటూ వ్యాఖ్య

Thiruveer: మసూద సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు తిరువీర్. అంతకుముందు చాలా సినిమాలే చేసిన అంతగా ఫేమ్ రాలేదు. కానీ, మసూద సినిమాతో ఒక్కసారిగా ఫుల్ ఫేమ్ దక్కించుకున్నాడు ఈ నటుడు. ఆ తరువాత పరేషాన్, ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి సినిమాలు చేశాడు. కానీ, ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు మరోసారి భగవంతుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు తిరువీర్(Thiruveer).

Faria Abdullah: భగవంతుడు మూవీ ఈవెంట్ లో ఫరియా అబ్దుల్లా.. ఫొటోలు

పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు జీజీ విహారి. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడికల్ అండ్ పొలిటికల్ డ్రామాలో రిషి నాగరాజు కీ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనంతరం మీడియా మీట్ కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక రిపోర్టర్ తిరువీర్ సినిమాల ప్రమోషన్స్ సరిగా జరగడం లేదని ప్రస్తావించాడు.

దానికి సమాధానంగా తిరువీర్ మాట్లాడుతూ.. నేను చేస్తున్న సినిమాలు నేను సెలెక్ట్ చేసుకున్న సినిమాలు కాదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలు. వాటికి ఎంత వరకు ఖర్చు చేయాలో అంతే ఖర్చు చేస్తున్నాం. ఇక సినిమాల ప్రమోషన్స్ అంటారా అది నా చేతుల్లో లేని పని. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు బాగానే చెప్తున్నారు. ప్రమోషన్స్ కి డబ్బులు ఉన్నాయని. తీరా సినిమా కంప్లీట్ అయ్యాక చేతులు ఎత్తేస్తున్నారు. నిజంగా నాకు డబ్బులు ఇస్తేనే ఇంటర్వ్యూలు చేస్తారని, డబ్బులు ఇస్తేనే సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారని తెలియదు. ఆ విషయంలో నేను ఇంకా మోసపోతూనే ఉన్నాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు తిరువీర్. దీంతో తిరువీర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.