Hero Venkatesh Playing with NTR Sons in Narne Nithiin Engagement Video goes Viral
NTR – Venkatesh : నేడు ఎన్టీఆర్ బామ్మర్ది, హీరో నార్నె నితిన్ నిశ్చితార్థం శివాని అనే అమ్మాయితో ఘనంగా జరిగింది. శివాని ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఫ్యామిలీకు బంధువులు అవుతారు. దీంతో నార్నె నితిన్ – శివాని నిశ్చితార్థానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు వెంకటేష్, దగ్గుబాటి ఫ్యామిలీ, పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు.
ఇప్పటికే బామ్మర్ది నిశ్చితార్థంలో ఎన్టీఆర్, అతని ఫ్యామిలీ చేసిన సందడి వీడియో రూపంలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆ కార్యక్రమం నుంచి మరో వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో హీరో వెంకటేష్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో సరదాగా ఆడుకుంటున్నారు. ఎన్టీఆర్ తనయులను దగ్గరకు తీసుకొని ముచ్చట్లు పెడుతున్నారు వెంకటేష్. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పక్కన నిర్మాత చినబాబు కూడా ఉన్నారు. ఫ్యాన్స్, నెటిజన్లు క్యూట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Abhay and Bhargav Ram with #Venkymama ❤️🔥😘@tarak9999 @VenkyMama pic.twitter.com/AJ3RtX5spQ
— EPIC (@Koduri_526) November 3, 2024