Vijay Deverakonda: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ.. పెళ్ళి ఆహ్వానం కోసమేనా!
సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).
- V Santhosh Kumar
- Published on- February 15, 2026 / 09:25 AM IST
Hero Vijay Deverakonda invites CM Revanth Reddy to his wedding with rashmika mandanna
Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, విజయ్ సీఎంని కలవడానికి గల ఆయన పెళ్లి అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)- రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గతేడాదే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
Queen Glimpse: హీరోయిన్ గా యామినీ ఈఆర్.. ఆసక్తికరంగా “క్వీన్” టైటిల్ గ్లింప్స్
కానీ, ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. కానీ, వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈనెల 26న వీరి పెళ్లి ఉదయపూర్ లో జరుగనుంది అని సమాచారం. దానికి సంబందించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలయ్యాయట. ఈనేపథ్యంలోనే తన పెళ్లికిక్ ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ కలిసినట్టుగా తెలుస్తోంది. అలాగే తన జీవితంలో జరుగనున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని సీఎం ని కోరాడట విజయ్ దేవరకొండ.
దానికి సీఎం కూడా చాలా పాజిటీవ్ రియాక్ట్ అయ్యారట. ఆలాగే, కాబోయే జంటకు ముందుగానే తన శుభాకాంక్షలు తెలిపారట సీఎం రేవంత్. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్తూ త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి బంధంలో ఒకటి కాబోతున్నారు.
