Heroine Bhagyashri Borse shocking comments on Pawan Kalyan craze
Bhagyashri Borse: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న సినిమా “ఆంధ్రా కింగ్ తాలూకా”. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నాడు. బయోపిక్ ఆఫ్ ఆ ఫ్యాన్(Bhagyashri Borse) అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక చాలా కాలం తరువాత రామ్ కూడా మాస్ కంటెంట్ తో కాకుండా తనకు అచ్చొచ్చిన క్లాస్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ట్రీట్మెంట్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందట.
K-Ramp OTT: ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ ‘కె-ర్యాంప్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?
రామ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటూ ఫిక్స్ ఐపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగా నవంబర్ 28న థియేటర్స్ కి రానుంది ఈ సినిమా. రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూవస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా సినిమా హీరోలకు ఉండే డైహార్డ్ ఫ్యాన్స్ గురించి ఉంటుంది.
నాకు అంతకుముందు వరకు హీరోల అభిమానులు ఇలా ఉంటారని తెలియదు. ఇక్కడకు వచ్చాక పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి మెంటల్ ఎక్కేసింది. ఆయనది మాములు ఫాలోయింగ్ కాదు. హీరో రామ్ కూడా హీరోల కోసం ఫ్యాన్స్ ఏమేం చేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఆలాంటి వాళ్లకి ఈ సినిమా ఖచ్చితంగా నచుతుంది. నార్త్ లో ఇంత ఫ్యాన్స్ హంగామా ఉండదు. అందుకే నాకు దాని గురించి పెద్దగా తెలియదు. ఇక్కడ చూసి షాక్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.