Heroine expresses anger over news of Trisha marrying Vijay
Trisha: చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ అసహనానికి గురయ్యింది. తనపై వస్తున్న తప్పుడు కథనాలకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంచమైనా సిగ్గనిపించడం లేదా అంటూ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు (Trisha)విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో గత కొన్నిరోజుల త్రిష గురించి అనేకరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రిష స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుంది అని, త్రిష రాజకీయ రంగప్రవేశం చేయనుంది అని. ఇలా చాలా రకాల వార్తలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి.
ఈ వార్తలు త్రిష వరకు చేరడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఎవరితో ఫోటోలు దిగితే వారిని పెళ్లి చేసుకున్నట్టేనా. ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారు. స్నేహితులతో దిగిన ఫోటోలను చూపించి పెళ్లి వార్తలు రాస్తున్నారు. అలాంటి వారిని చేస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇకనైనా ఫేక్ న్యూస్ రాయడం ఆపేయండి”అంటూ ఇండైరెక్ట్ గా వారింగ్న్ ఇచ్చింది త్రిష. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో భారీగ్రాఫిక్స్ తో పాన్ ఇండియా లెవల్లో రానుంది.
దాదాపు రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో విశ్వంభర విడుదల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సమాచారం మేరకు ఈ సినిమా 2026 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి చాలా కాలం తరువాత తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న త్రిషకు ఎలాంటి రిజల్ట్ రానుంది అనేది చూడాలి.